‘పోడు’ సమస్య తీరనుందా?.. సీఎస్ కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పోడు భూముల సమస్య ఉండగా.. ప్రతిసారి అటవీ శాఖ ఉద్యోగులకు, పోడు రైతులకు ఘర్షణలు జరుగుతుండటం చూస్తూనే ఉన్నాం. ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తున్నప్పటికీ గత ఏడేళ్లుగా వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి పోడు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ కొన్ని రోజుల క్రితం ఆదేశించారు. ఈ సబ్ […]
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పోడు భూముల సమస్య ఉండగా.. ప్రతిసారి అటవీ శాఖ ఉద్యోగులకు, పోడు రైతులకు ఘర్షణలు జరుగుతుండటం చూస్తూనే ఉన్నాం. ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తున్నప్పటికీ గత ఏడేళ్లుగా వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి పోడు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ కొన్ని రోజుల క్రితం ఆదేశించారు. ఈ సబ్ కమిటీ పలుసార్లు సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పోడు భూముల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అక్టోబర్ మూడో వారం నుంచి పోడు రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి విధి విధానాలు, దరఖాస్తు ఏ విధంగా ఉండాలి, దరఖాస్తులో పొందు పరిచే అంశాలు, అటవీ సరిహద్దుల కోఆర్డినెట్స్ నిర్ణయం, వివిధ స్థాయిల్లో కమిటీల ఏర్పాటు, అటవీ పరిరక్షణకు పౌరుల భాగస్వామ్యం తదితర అంశాల గురించి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమిషనర్ శేషాద్రి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిష్టినా, తెలంగాణ టెక్నాలాజికల్ సర్వీసెస్ ఎం.డి.వెంకటేశ్వర్ రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.