తెలంగాణలో ‘లాక్‌డౌన్’పై సీఎస్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బుధవారం మరోసారి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో సాధారణ పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో అక్కడి అవసరాలను బట్టి ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్ పెట్టుకున్నాయి. లాక్‌డౌన్ విషయం.. ప్రజల జీవనోపాధితో ముడిపడి ఉంది.. కాబట్టి వారి […]
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బుధవారం మరోసారి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో సాధారణ పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు.
వివిధ రాష్ట్రాల్లో అక్కడి అవసరాలను బట్టి ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్ పెట్టుకున్నాయి. లాక్‌డౌన్ విషయం.. ప్రజల జీవనోపాధితో ముడిపడి ఉంది.. కాబట్టి వారి గురించి కూడా ఆలోచించాలని అన్నారు. అందువల్ల తెలంగాణలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉండదు అని సీఎస్ ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే, లాక్‌డౌన్ అవసరం ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ దానిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కరోనా కట్టడి కోసం హైకోర్టు చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. హైకోర్టు చెప్పిన విధంగా వీకెండ్ లాక్‌డౌన్ గురించి పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టడం కన్నా బాధితులకు మంచి చికిత్స అందిచడం ముఖ్యం అని సీఎస్ పేర్కొన్నారు.