సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌లో 122 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఈస్ట్ ఢిల్లీ మయూర్ విహార్‌ ఫేజ్ 3లోని 31వ బెటాలియన్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ పారామిలిటరీ ఫోర్స్‌ బెటాలియన్‌లో రెండు వారాల్లోనే 122 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, మరో 100 కేసుల ఫలితాలు విడుదల కావలసి ఉన్నది. దీంతో ఈ బెటాలియన్‌ను పూర్తిగా సీల్ చేశారు. ఈ బెటాలియన్‌లో కేసులు నమోదవడంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. […]

Update: 2020-05-02 03:02 GMT

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఈస్ట్ ఢిల్లీ మయూర్ విహార్‌ ఫేజ్ 3లోని 31వ బెటాలియన్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ పారామిలిటరీ ఫోర్స్‌ బెటాలియన్‌లో రెండు వారాల్లోనే 122 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, మరో 100 కేసుల ఫలితాలు విడుదల కావలసి ఉన్నది. దీంతో ఈ బెటాలియన్‌ను పూర్తిగా సీల్ చేశారు. ఈ బెటాలియన్‌లో కేసులు నమోదవడంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. బెటాలియన్‌లో కరోనా కట్టడి చర్యలపై సీఆర్‌పీఎఫ్ చీఫ్‌ను వివరణ కోరింది. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన పారమెడిక్ యూనిట్‌లోని నర్సింగ్ అసిస్టెంట్ నుంచి జవాన్లకు ఈ వైరస్ సోకినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

tags: coronavirus, spread, containment, delhi, crpf, battalion, two weeks

Tags:    

Similar News