భారత్‌లో క్రిప్టో కరెన్సీ సేవలు ప్రారంభం..
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్, డిజిటల్ అసెట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ క్రాస్‌టవర్ మంగళవారం భారత్‌లో తన క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్ పటిష్టమైన రక్షణ, సేవలు, సామర్థ్యంతో పాటు స్థిరమైన మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. క్రాస్‌టవర్ సంస్థ క్రిప్టోకంపార్ అందించే 152 గ్లోబల్ ఎక్స్ఛేంజీల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రిప్టోకంపార్ అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీ డేటాను కలిగిన అథారిటీ సంస్థ. ఈ ర్యాంకింగ్ […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్, డిజిటల్ అసెట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ క్రాస్‌టవర్ మంగళవారం భారత్‌లో తన క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్ పటిష్టమైన రక్షణ, సేవలు, సామర్థ్యంతో పాటు స్థిరమైన మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. క్రాస్‌టవర్ సంస్థ క్రిప్టోకంపార్ అందించే 152 గ్లోబల్ ఎక్స్ఛేంజీల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రిప్టోకంపార్ అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీ డేటాను కలిగిన అథారిటీ సంస్థ. ఈ ర్యాంకింగ్ ఆయా క్రిప్టో కరెన్సీ సంస్థల ఆస్తి, మార్కెట్ నాణ్యత, డేటా, భద్రత, కేవైసీ, నిబంధనలు, పనిచేసే బృందంపై ఆధారపడి నిర్ణయిస్తారు.
‘తమ వినియోగదారులకు పోటీ ధరల్లో సేవలందిస్తున్నాం. వారికవసరమైన రక్షణ కోసం అధునాత మౌలిక సదుపాయాలు, భద్రత చర్యలను ఉపయోగిస్తున్నాం. భారత్‌లో తమ ప్లాట్‌ఫామ్ లాంచింగ్ సందర్భంగా క్రాస్‌టవర్ తొలి 1000 మంది భారతీయ వినియోగదారులకు మొదటి ట్రేడ్ ఎక్స్ఛేంజ్‌లో రూ. 500 లోపు విలువైన అదనపు బిట్‌కాయిన్ సంపాదించే అవకాశాన్ని అందిస్తోందని’ కంపెనీ వివరించింది. కాగా, దేశీయంగా క్రిప్టోకరెన్సీ మార్కెట్ 2020, ఏప్రిల్‌లో సుమారు రూ. 6,780 కోట్ల నుంచి 2021లో ఇప్పటివరకు ఏకంగా రూ. 48.45 వేల కోట్లకు పెరిగింది. ఇది నెలవారీ సగటున 50 శాతం వృద్ధి సాధిస్తోంది.