వేడెక్కిన రాజకీయం.. శాయంపేటలో టీఆర్ఎస్ vs కాంగ్రెస్
దిశ, పరకాల: సెప్టెంబర్ 30వ తేదీన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క రగిలించిన రాజకీయ నిప్పు వరంగల్‌లో కుంపటిలా తయారైంది. దీనికితోడు రోజూ కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణులు ఒకరిని మించి ఒకరు ఆజ్యం పోస్తున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే శాయంపేట మండలంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని, నాయిని రాజేందర్ రెడ్డిని బ్రోకర్లుగా, చీటర్లుగా […]
దిశ, పరకాల: సెప్టెంబర్ 30వ తేదీన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క రగిలించిన రాజకీయ నిప్పు వరంగల్‌లో కుంపటిలా తయారైంది. దీనికితోడు రోజూ కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణులు ఒకరిని మించి ఒకరు ఆజ్యం పోస్తున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే శాయంపేట మండలంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని, నాయిని రాజేందర్ రెడ్డిని బ్రోకర్లుగా, చీటర్లుగా చిత్రీకరిస్తూ టీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. దీనికి స్పందించిన కాంగ్రెస్ నేతలు గండ్ర వెంకటరమణా రెడ్డి ఉద్దేశిస్తూ.. అక్రమంగా భూకబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.
అంతేగాకుండా.. ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి తట్టెడు మట్టి పోయకుండా గోవిందాపూర్, పెద్దకొడపాక గ్రామాల మధ్య రోడ్డులో చదును చేసి మట్టి పోసినట్లుగా చిత్రీకరించి, అక్రమంగా నిధులు కాజేశారని ఆరోపించారు. వివిధ పనుల పేరుతో సుమారు రూ.6 లక్షలు అక్రమంగా మండల పరిషత్ నిధులు కాజేశారని విమర్శించారు. అయితే.. ఈ సవాళ్లు అంతిమంగా టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇరకాటంలో పడేశాయని జిల్లాలో పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలను, సవాళ్లను టీఆర్ఎస్ నాయకత్వం స్వీకరించి, సమాధానం చెబుతుందో లేదో వేచి చూడాలి.