వాహన అమ్మకాలు 25శాతం తగ్గుతాయి!

దిశ, వెబ్‌డెస్క్ : గత ఆర్థిక సంవత్సరం 2019-20లో వాహన అమ్మకాలు 18 శాతం క్షీణించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో 25 శాతం వాహన అమ్మకాలు పడిపోయే ప్రమాదముందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. వరుసగా రెండేంళ్ల నుంచి వాహన విక్రయాలు రెండంకెల క్షీణతను నమోదు చేస్తున్నాయి. దీంతో డీలర్ల లాభాలు క్షీణించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మరింత తగ్గుతుందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ఇటీవల క్రిసిల్ రేటింగ్ పొందిన సుమారు […]

Update: 2020-07-09 02:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ : గత ఆర్థిక సంవత్సరం 2019-20లో వాహన అమ్మకాలు 18 శాతం క్షీణించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో 25 శాతం వాహన అమ్మకాలు పడిపోయే ప్రమాదముందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. వరుసగా రెండేంళ్ల నుంచి వాహన విక్రయాలు రెండంకెల క్షీణతను నమోదు చేస్తున్నాయి. దీంతో డీలర్ల లాభాలు క్షీణించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మరింత తగ్గుతుందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ఇటీవల క్రిసిల్ రేటింగ్ పొందిన సుమారు 2050 మంది డీలర్ల పరిస్థితిపై క్రిసిల్ సంస్థ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం. కొవిడ్-19 కారణంగా జూన్ త్రైమాసికంలో వాహన విక్రయాలు మరింత క్షీణిస్తాయని, వ్యాపారం తక్కువగా ఉండటం, రవాణా ఆంక్షలు, పరిస్థితులకు అనుగుణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో వాహన అమ్మకాలపై తీవ్రమైన ప్రభావం ఉందని క్రిసిల్ పేర్కొంది. ఈ పరిణామాలతో కంపెనీలు కొత్త వాహన డీలర్ల ఏర్పాటుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని నివేదికలో తేలింది. అయితే, సొంతంగా షోరూమ్‌ను నిర్వహిస్తున్న డీలర్లు, విడి భాగాల అమ్మకం, బీమా, దాని అనుబంధ సేవలను కలిగిన వారు ప్రస్తుత నష్టాల నుంచి నిలదొక్కుకునే అవకాశముంది. ఎందుకంటే, ఈ సేవల నుంచి డీలర్లకు వచ్చే ఆదాయం 10 నుంచి 12 శాతం ఉండటమే. అలాగే, ఆర్‌బీఐ ఇచ్చిన మారటోరియం, ప్రోత్సాహకాలు, వడ్డీ వ్యయాలపై కంపెనీల సహకారంతో డీలర్లకు ద్రవ్య లభ్యత పెరుగుతుంది. ఇక, ద్విచక్ర వాహన డీలర్ల కంటే వాణిజ్య వాహనాల డీలర్లకు ఎక్కువ నష్టాలు ఉండే అవకాశముందని క్రిసిల్ నివేదిక తెలిపింది. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు ఎక్కువగా సొంత వాహనాలకు ఆసక్తి చూపిస్తున్నందున 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండో సగం నుంచి వాహన అమ్మకాలు పెరుగుతాయని క్రిసిల్ అంచనా వేసింది.

Tags:    

Similar News