నీటికుంటలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. 40 మంది విద్యార్థులకు..

వికారాబాద్ జిల్లా సుల్తాన్‌పూర్‌లోని కుంటలోకి స్కూల్ బస్సు దూసుకెళ్లింది.

Update: 2023-09-23 04:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా సుల్తాన్‌పూర్‌లోని కుంటలోకి స్కూల్ బస్సు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో 40 మంది విద్యార్థులు బస్సులో ఉండగా విద్యార్థులను హుటాహుటిన స్థానికులు కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది. స్టీరింగ్ పని చేయకపోవడంతో బస్సు ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపారు. ఘటన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News