ఇప్పించిన అప్పు ఇవ్వడం లేదని ఆత్మహత్య

అవసరం నిమిత్తం బయట అప్పు ఇప్పిస్తే తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకుండా ఏం చేసుకుంటారో చేసుకోండని బెదిరింపులకు పాల్పడటంతో షూరిటీ ఉన్న వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2024-09-17 15:03 GMT

దిశ, కామారెడ్డి : అవసరం నిమిత్తం బయట అప్పు ఇప్పిస్తే తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకుండా ఏం చేసుకుంటారో చేసుకోండని బెదిరింపులకు పాల్పడటంతో షూరిటీ ఉన్న వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గాంధారి నరేష్ (40) కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తికి తన సొంత డబ్బు ఇవ్వడంతో పాటు ఇతరుల వద్ద మొత్తం రూ.10 లక్షల అప్పు షూరిటీ ఉండి ఇప్పించాడు. కొద్దిరోజులుగా డబ్బుల గురించి అడిగితే రేపు మాపు అంటూ వాయిదాలు పెడుతూ వస్తున్నాడు.

    రెండు రోజుల క్రితం డబ్బులు ఖచ్చితంగా కావాలని గట్టిగా అడిగితే లేవని, ఏం చేసుకుంటావో చేసుకొమ్మని బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో తన సొంత డబ్బుతో పాటు ఇప్పించిన డబ్బులు వస్తాయో రావో అని మనస్తాపం చెంది ఉరేసుకుని మృతి చెందాడు. ఈ విషయమై మృతుని భార్య ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఏడేళ్ల కూతురు, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. నరేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News