కీచక ఉపాధ్యాయుడు సస్పెండ్.. క్లాస్ రూంలోనే అలా చేస్తూ..!
పిల్లలపై లైంగిక దాడికి పాల్పడుతున్న కీచక ఉపాధ్యాయుడు బాగోతం వెలుగులోకి వచ్చింది.
దిశ ప్రతినిధి, శ్రీకాకుళం : పిల్లలపై లైంగిక దాడికి పాల్పడుతున్న కీచక ఉపాధ్యాయుడు బాగోతం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలోనారాయణ రావు సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఓ వైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూనే మరోవైపు గుట్టుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇలా 6, 8 తరగతి చదువుతున్న బాలికలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. క్లాస్ రూమ్‌లలో చిన్నారులను టచ్ చేయకూడని చోట టచ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఉపాధ్యాయుడి ప్రవర్తనతో విసిగిపోయిన విద్యార్థినీలు తమ తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు స్కూల్‌కి వచ్చి ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుడిని, స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో దిగి వచ్చిన యాజమాన్యం టీచర్ పట్ల సీరియస్ అయ్యింది.
మండల విద్యాశాఖాధికారి విచారణ..
తల్లిదండ్రుల ఆందోళనతో స్కూల్ యాజమాన్యం దిగివచ్చింది. నారాయణ రావును విధుల నుంచి సస్పెండ్ చేసింది. అయితే విషయం ఆమదాలవలస మండల విద్యాశాకాధికారికి తెలియటంతో స్కూల్‌కి వెళ్లి విచారణ చేపట్టారు. మండల విద్యాశాఖ అధికారి. చిన్నారుల తల్లిదండ్రులను స్కూల్‌కి పిలిచి జరిగిన ఘటనపై ఆరా తీశారు. పాఠశాల యాజమాన్యంతోను చర్చించారు.
అయితే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఆ కీచక ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేశానని.. మళ్ళీ ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడతామని ఎంఈవో సమక్షంలోనే తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు. మరోవైపు తాను విచారణ చేపట్టిన దానిపై నివేదిక తయారు చేసి డీఈవో, డిప్యూటీ డీఈవోకు పంపిస్తానని తెలిపారు. ఉన్నతాధికారుల నుండి వచ్చిన అదేశాలు ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని ఎంఈవో తెలిపారు