వ్యభిచార కేంద్రం పై పోలీసుల దాడి.. పట్టుబడిన బీఎల్ఎఫ్ రాష్ట్ర నేత

నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లోని వ్యభిచార కేంద్రం పై మూడో టౌన్ పోలీసులు దాడి నిర్వహించారు.

Update: 2024-06-27 16:17 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లోని వ్యభిచార కేంద్రం పై మూడో టౌన్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలితో పాటు ఇద్దరు మహిళలు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర నాయకుడు దండి వెంకటి పట్టుబడ్డారు. ఈ మేరకు మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు మూడవ టౌన్ ఎస్సై ప్రవీణ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో కార్మిక సంఘాల నాయకుడి ముసుగులో ఉన్న దండి వెంకటి రాసలీలల వ్యవహారం బట్టబయలైంది. నిజామాబాద్ కార్మిక లోకం మొత్తానికి షాక్ కు గురయింది.


Similar News