భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి

ఛత్తీస్‌గఢ్ సరిహద్దులలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలతో కలిసి పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.

Update: 2024-03-19 03:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ సరిహద్దులలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలతో కలిసి పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులను గుర్తించి ఒక్కసారిగా భారీ ఎత్తున కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన మావోయిస్టులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మొత్తం నలుగురు అగ్రనేతలు హతమైనట్లు సమాచారం. ఈ నలుగురు మావోయిస్టులపై రూ.36 లక్షల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో వర్గీస్, మగ్తూ, కుర్సంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్‌లు ఉన్నారు. వర్గీస్ మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీగా, మగ్తూ చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీగా, రాజు, వెంకటేశ్ ప్లటూన్‌ మెంబర్లుగా కొనసాగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి ఏకే47, ఒక కార్బెన్, రెండు పిస్టల్స్, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News