Life imprisonment : మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరికి జీవిత ఖైదు
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు యువకులకు జీవిత ఖైదు విధిస్తూ బుధవారం కరీంనగర్ జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి వెంకటేష్ తీర్పును వెలువరించారు.
దిశ, కరీంనగర్ లీగల్ : మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు యువకులకు జీవిత ఖైదు విధిస్తూ బుధవారం కరీంనగర్ జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి వెంకటేష్ తీర్పును వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. కరీంనగర్ లో నివాసం ఉంటున్న ఒక కుటుంబంలోని మూడో తరగతి చదువుతున్న 9 సంవత్సరాల మైనర్ బాలికను కరీంనగర్ లోని అంబేద్కర్ నగర్ కు చెందిన ఇటిక్యాల వినోష్ 2020 వ సంవత్సరం ఫిబ్రవరి 24 వ తేదీన ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను తన రూంకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలికకు జ్వరం రావడంతో ఆమెను ఇంటి వద్దే వదిలి తల్లిదండ్రులు పనికి వెళ్లగా మరుసటి రోజు 25వ తేదీన వినోష్ బాలికను మళ్లీ తన రూంకు తీసుకెళ్లగా అతని తో పాటు మన్నెం రవి, తేజలు బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డారు.
అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు. కాగా బాలికకు తీవ్ర జ్వరం రావడంతో 26 వ తేదీన బాలిక తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలిక పై అత్యాచారం జరిగినట్లు వైద్యురాలు చెప్పడంతో తల్లి బాలికను ప్రశ్నించగా ఆమె జరిగిన విషయం తెలపడంతో బాలిక తల్లి కరీంనగర్ మూడో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసుకు సంబంధించిన సాక్షులను కోర్టులో హాజరు పరచగా పబ్లిక్ ప్రాసీక్యూటర్ జూలూరి శ్రీరాములు సాక్షులను విచారించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి వెంకటేశ్ ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధించడం తో పాటు ఒక్కొక్కరికి రూ. 6 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. ఈ కేసులో మరో మైనర్ బాలుడు కూడా ఉండడం తో అతనిపై జూవైనల్ కోర్టు లో కేసు నడుస్తుందని పోలీసులు తెలిపారు.
Read more...
Suicide Note: కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ నోట్.. మనస్తాపంతో విద్యార్థి బలవన్మణం