HYD : అంబర్‌పేట్‌లో దారుణం.. మైనర్‌పై దాడి చేసిన బాలుడు ఆత్మహత్య

తనను ప్రేమించడం లేదంటూ అంబర్‌పేట్‌లో ఓ బాలుడు మైనర్‌పై కత్తితో దాడికి పాల్పడిన ఘటన తెలిసిందే.

Update: 2024-01-19 05:51 GMT
HYD : అంబర్‌పేట్‌లో దారుణం.. మైనర్‌పై దాడి చేసిన బాలుడు ఆత్మహత్య
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : తనను ప్రేమించడం లేదంటూ అంబర్‌పేట్‌లో ఓ బాలుడు మైనర్‌పై కత్తితో దాడికి పాల్పడిన ఘటన తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు బాధితురాలితో సహా అడ్డొచ్చిన మరో అమ్మాయిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తాజాగా.. ఇవాళ దాడికి పాల్పడిన బాలుడు ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది. బాధితుల ఫిర్యాదు మేరకు దాడి చేసిన బాలుడిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాలుడు విద్యానగర్ రైల్వే ట్రాక్‌పై పడుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. కాగా, బాలుడి దాడిలో గాయపడిన మైనర్లు ఇద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Tags:    

Similar News