Geetha worker : తాటి చెట్టుకు ఉరివేసుకొని గీత కార్మికుడి ఆత్మహత్య..

మండల పరిధిలోని పాత ముకుందాపురం గ్రామానికి చెందిన ఓ గీత కార్మికుడు తాడిచెట్టు పైకెక్కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

Update: 2024-08-02 15:35 GMT

దిశ, మునగాల : మండల పరిధిలోని పాత ముకుందాపురం గ్రామానికి చెందిన ఓ గీత కార్మికుడు తాడిచెట్టు పైకెక్కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ముకుందాపురం గ్రామానికి చెందిన దేశ గాని వెంకటేశం (64) తాడిచెట్టు పైకి ఎక్కి తాటి మట్టకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతునికి సంతానం లేకపోవడం, రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం కావడం, భార్య లింగమ్మ మతిస్థిమితం సక్రమంగా లేకపోవడంతో మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకోవచ్చని గ్రామస్తులు తెలిపారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వెంకటేశం మృతదేహాన్ని తాడిచెట్టు పై నుండి క్రిందకు దించుతున్న సమయంలో నాగార్జున అనే గీత కార్మికుడి పై మృతదేహం పడడంతో అతనికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం కోదాడకు తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆరుపదుల వయసులో కూడా తాడి చెట్లు ఎక్కి జీవనం సాగిస్తున్న నిరుపేద అయిన వెంకటేశం కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం నాయకులు కోరారు.

Tags:    

Similar News