విద్యుత్ షాక్ తో రైతు మృతి

తన సొంత పొలంలో వైర్లు సరి చేయడానికి వెళ్లి షాక్ తగలడంతో రైతు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా గుడిగానిపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

Update: 2023-08-29 17:05 GMT
విద్యుత్ షాక్ తో రైతు మృతి
  • whatsapp icon

దిశ,ఊర్కొండ: తన సొంత పొలంలో వైర్లు సరి చేయడానికి  వెళ్లి షాక్ తగలడంతో రైతు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా గుడిగానిపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గుడిగానిపల్లి గ్రామానికి చెందిన గుండూరి వెంకటయ్య (45) స్వంత పొలంలో వర్షాలు లేక పంటలు ఎండుతుండటంతో, మోటర్ వైర్లు సరిచేసి పంటలకు నీరు అందించడానికి,  విద్యుత్ నియంత్రికను ఆఫ్ చేయడానికి వెళ్లిగా..ఏబి స్విచ్ పైపు ఊడి విద్యుత్ వైర్ల పైన పడటంతో  వెంకటయ్యకు షాక్ తగిలింది. గమనించిన కుటుంబ సభ్యులు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. వెంకటయ్య శరీరాన్ని పరిశీలించిన వైద్యులు విద్యుత్ షాక్ తగిలిన వెంటనే వెంకటయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కి భార్య గంగమ్మ తో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు  తెలిపారు.

Similar News