బ్రేకింగ్: మిలటరీ అకాడమీపై డ్రోన్ ఎటాక్.. 100 మంది జవాన్లు మృతి

సిరియాలో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. రక్షణ శాఖ అధికారులే లక్ష్యంగా మిలటరీ అకాడమీపై డ్రోన్ల దాడి చేశారు.

Update: 2023-10-06 03:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: సిరియాలో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. రక్షణ శాఖ అధికారులే లక్ష్యంగా మిలటరీ అకాడమీపై డ్రోన్ల దాడి చేశారు. ఈ ఎటాక్‌లో దాదాపు 100 మంది యువ జవాన్లు మృతి చెందారు. మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. సైనిక కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుక సమయంలో ఉగ్రవాదులు డ్రోన్ ఎటాక్ చేయడంతో సైనిక శిక్షణ పూర్తి చేసుకుని.. విధి నిర్వహణలోకి అడుగుపెట్టబోతున్న యువ జవాన్లు భారీగా ప్రాణాలు కోల్పోయారు. సాయుధ ఉగ్రసంస్థలే ఈ డ్రోన్ దాడికి పాల్పడ్డాయని సిరియా మిలటరీ ఆరోపించింది.

ఈ ఘటనపై సిరియా ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సిరియా ప్రభుత్వం పేర్కొంది. సిరియాలో జరిగిన డ్రోన్ దాడులపై అగ్రరాజ్యం అమెరికా, రష్యా సీరియస్ అయ్యాయి. ఈ ఘటలో సిరియాకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించాయి. ఇక, మిలటరీ అకాడమీపైనే టెర్రరిస్టులు దాడికి పాల్పడటంతో ఆ దేశ రక్షణ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉందనే దానిపై విచారణ చేపట్టారు. 

Read More..

బ్రేకింగ్: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి.. భవనంలో చిక్కుకున్న 30 మంది  

Tags:    

Similar News