బక్రీద్ పేరుతో బకరాలను చేసిండ్రు

బక్రీద్ పండుగ రోజు మటన్ సరఫరా చేస్తామని అమాయకులను నమ్మించి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి పరారైన ముగ్గురిని సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

Update: 2024-07-03 14:56 GMT

దిశ, మెహిదీపట్నం : బక్రీద్ పండుగ రోజు మటన్ సరఫరా చేస్తామని అమాయకులను నమ్మించి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి పరారైన ముగ్గురిని సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. కేసు వివరాలను బుధవారం డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి మెహిదీపట్నంలోని తన కార్యాలయంలో వెల్లడించారు. ఖిదమత్ ఫౌండేషన్ అనే పేరుతో ముగ్గురు వ్యక్తులు ఒక ఫేక్ యాప్ తయారుచేసి బక్రీద్ పండుగ రోజున 2,800 రూపాయిలకే నాణ్యమైన మేక మాంసం సరఫరా చేస్తామని నమ్మించారు. ఈ నేపథ్యంలో పలువురు నుంచి

     డబ్బులు వసూలు చేశారు. ఆ తర్వాత బక్రీద్ రోజున మాంసం సరఫరా చేయకపోవడంతో మోసపోయిన బాధితులు 17వ తేదీ సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు మొహమ్మద్ నసీర్ (30) బహదూర్పురా నివాసి, జాఫర్ అహ్మద్ (29) సన్ సిటీ ప్రాంతం, మొహమ్మద్ ఆశ్ఫాక్(30) సన్ సిటీ నివాసి. వీరు ముగ్గురు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. నిందితుల నుంచి 23 లక్షల నగదు, ఒక లాప్టాప్, ఒక పెన్ డ్రైవ్, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరందరినీ కోర్టుకు తరలించారు.

బాధితులు 2000 మందికి పైగా..

నిందితులు మల్లేపల్లి ప్రాంతం నుంచి సుమారు 407 మంది నుంచి, అదేవిధంగా హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 2179 మంది నుంచి ఒక్కో యూనిట్​కు 2800 చొప్పున డబ్బులు వసూలు చేశారు. వృద్ధులు, మేకలు కొనుగోలు చేసి వాటిని కోయడం ఇబ్బందిగా భావించిన వారు అంతా వీరి వద్ద మటన్ కొనుగోలు చేసేందుకు డబ్బులు చెల్లించినట్లు డీసీపీ ఉదయ్ కుమార్ తెలిపారు.

     నిందితులపై వివిధ ప్రాంతాల్లో పాత కేసులు కూడా నమోదై ఉన్నట్లు తెలిపారు. రెండు మూడు సంవత్సరాలుగా వీరు జనాన్ని మోసం చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరపరిచి రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అశ్వాక్, గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయాజ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


Similar News