Libya Floods: లిబియాలోని డెర్నా వరదల్లో మరణించిన వారి సంఖ్య 20,000 కి చేరుకోవచ్చు: మేయర్

క్షిణాఫ్రికా దేశాల్లో ఒకటైన లిబియాలోని డెర్నా నగరంలో భారీ తుఫాను కారణంగా వరదలు సంభవించాయి. దీంతో డెర్నా నగరంపై ఉన్న రెండు ప్రధాన రిజర్వాయర్లు తెగడంతో ఒక్కసారిగా వచ్చిన వరదలు.. ఆ పట్టణాన్ని పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయాయి.

Update: 2023-09-14 02:45 GMT

దిశ, వెబ్‌డెస్స్: దక్షిణాఫ్రికా దేశాల్లో ఒకటైన లిబియాలోని డెర్నా నగరంలో భారీ తుఫాను కారణంగా వరదలు సంభవించాయి. దీంతో డెర్నా నగరంపై ఉన్న రెండు ప్రధాన రిజర్వాయర్లు తెగడంతో ఒక్కసారిగా వచ్చిన వరదలు.. ఆ పట్టణాన్ని పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయాయి. ముఖ్యంగా వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయి సముద్రంలో కలిసిపోయాయంటే వరదలు ఏ విధంగా వచ్చయో అంచనా వేయవచ్చు. సోమవారం సంభవించిన ఈ దుర్ఘటన వల్ల నేటికి చనిపోయిన వారితో కలిపి.. 18,000 నుండి 20,000 కనిపించకుండా పోయారు. దీంతో 20,000 వరకు ప్రజలు మరణించి ఉంటారని.. ఆ నగర మేయర్ అబ్దుల్మేనమ్ అల్-గైతీ ఈ రోజు అల్-అరేబియా టీవీ కి చెప్పారు. ఇంకా వేలాది మంది ప్రజలు తప్పిపోయారని.. వారి శవాలు సముద్రంలో తేలుతు దొరుకుతున్నాయని.. మరికొందరు శిథిలాలు, మట్టిలో కూరుకుపోయారని, చనిపోయిన వారి శవాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు. గాలింపు చర్యలు ముమ్మరం చేసిన కొద్ది శవాలు కుప్పలు తెప్పలుగా బయట పడుతుండటంతో.. డెర్నా నగరం భారీ స్మశానాన్ని తలపిస్తుంది. దీంతో అధికారులే.. సామూహికంగా ఒకే ప్రదేశంలో మృతులకు అంత్యక్రియలు చేస్తున్నారు.

Tags:    

Similar News