దండేప‌ల్లి సబ్ ఇన్‌స్పెక్టర్‌పై వేటు

అధికార పదవి దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై దండేపల్లి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కళ్యాణం నరేష్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

Update: 2024-02-17 14:41 GMT

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో : అధికార పదవి దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై దండేపల్లి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కళ్యాణం నరేష్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు కాళేశ్వరం జోన్ ఇన్‌చార్జి డాక్టర్ తరుణ్ జోషి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తన అధికారిక పదవిని దుర్వినియోగం చేసి, అవినీతికి పాల్పడి పోలీసు శాఖకు చెడ్డపేరు తెచ్చినందుకు నరేష్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల కింద‌టే న‌రేష్ కన్నెపల్లి పోలీస్ స్టేషన్ నుంచి దండేపల్లికి బదిలీ అయ్యారు. కొందరు స్థానికులు శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు.

Read More..

మార్చి 4 వరకు.. సిటీ పోలీస్ యాక్ట్ అమలు 

Tags:    

Similar News