హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. గన్ మిస్ ఫైర్ కావడంతో CISF జవాన్ మృతి

హైదరాబాద్ బీడీఎల్ భానూరులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో ఓ సీఐఎస్ఎఫ్ జవాన్ మృతి చెందాడు.

Update: 2024-07-20 12:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బీడీఎల్ భానూరులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో ఓ సీఐఎస్ఎఫ్ జవాన్ మృతి చెందాడు. విధులు ముగించుకుని వాహనంలో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన జవాన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకటేశ్వర్లుగా అధికారులు గుర్తించారు.  గత ఏడాది ట్రాన్స్‌ఫర్‌పై బీడీఎల్‌కు వచ్చిన వెంకటేశ్వర్లు ప్రస్తుతం ఇక్కడే విధుల నిర్వహిస్తున్నాడు. శనివారం విధులు ముగించుకుని బస్సులో వెళ్లిన వెంకటేశ్వర్లు.. బస్సు దిగుతోన్న క్రమంలో గన్ మిస్ ఫైర్ అయ్యి బుల్లెట్ బాడీలోకి దూసుకెళ్లడంతో మరణించాడు. తుపాకీ మిస్ ఫైర్ కావడం వల్లే వెంకటేశ్వర్లు మృతి చెందినట్లు నిర్ధారించిన అధికారులు.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అప్పటి వరకు తమతో సరదాగా ఉన్న వెంకటేశ్వర్లు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో తోటి జవాన్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News