Breaking: ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి, భారీగా ఆయుధాలు స్వాధీనం

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Update: 2024-05-23 13:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నేతల సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని రౌండప్ చేశాయి. ఈ క్రమంలో ఇంద్రావతి ఏరియా కమిటీ, నారాయణపూర్, దంతెవాడ, బస్తర్ జిల్లాలకు చెందిన డీఆర్‌జీ, బస్తర్ ఫైటర్లతో పాటు ఎస్టీఎఫ్ బృందాలతో మావోయిస్టులు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పుల మోత మోగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో కొందరు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉన్నట్లుగా సమాచారం. ఎన్‌కౌంటర్‌లో భాగంగా భద్రతా దళాలు ఘటనా ప్రాంతంలో భారీగా ఆయుధాలు, విప్లవ సహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

Tags:    

Similar News