BREAKING: అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ల ముఠా అరెస్ట్.. భారీ ఎత్తున డ్రగ్స్, ఎండీఎంఏ స్వాధీనం

రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

Update: 2024-07-22 08:01 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు డ్రగ్స్ అమ్ముతూ రెడ్‌ హ్యాండెడ్‌గా ఎవరు పట్టుబడినా.. తీసుకున్నా వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలంటూ పోలీసు శాఖకు ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్, ఇతర పోలీసు, నార్కోటిక్ బ్యూరో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, పబ్బులు, క్లబ్‌లలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ.. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని ఎక్కడికక్కడ కేసులు బుక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రచకొండ కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు సోమవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో డగ్స్ అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారి నుంచి 40 కిలోల డ్రగ్స్‌తో పాటు 10 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. 

Read More..

హైదరాబాద్‌లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఠాల డ్రగ్స్ అమ్మకాలు 

Tags:    

Similar News