BREAKING: వికారాబాద్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం.. రూ.లక్షల్లో ఆస్తి నష్టం

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Update: 2024-03-03 04:53 GMT
BREAKING: వికారాబాద్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం.. రూ.లక్షల్లో ఆస్తి నష్టం
  • whatsapp icon

దిశ, వెబ్‌‌డెస్క్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇవాళ వికారాబాద్ జిల్లా తాండూరులోని మార్వాడీ బజార్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అనుకోకుండా ఓ కూలర్ల దుకాణాల్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలు దుకాణాల్లో వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు పేర్కొన్నారు. అయితే, ప్రమాదం షాట్ సర్య్కూట్ వల్ల జరిగిందా.. మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News