BREAKING: నగరంలో పట్టపగలే దారుణ హత్య.. బండరాయితో మోది హతమార్చిన దుండగులు

ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Update: 2024-03-17 14:02 GMT
BREAKING: నగరంలో పట్టపగలే దారుణ హత్య.. బండరాయితో మోది హతమార్చిన దుండగులు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. నగర పరిధిలోని చిక్కడపల్లి ప్రాంతంలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. వ్యక్తి తలపై రాయితో బలంగా మోది దారుణానికి ఒడిగట్టారు. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మృతుడు బేగంపేటకు చెందిన గోపాల్‌గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News