అమెరికాలో మరోసారి కాల్పులు..ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెన్నెస్సీ రాష్ట రాజధాని మెంఫిస్‌లో ఓ పార్టీ సందర్భంగా భారీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా..మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Update: 2024-04-21 05:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెన్నెస్సీ రాష్ట రాజధాని మెంఫిస్‌లో ఓ పార్టీ సందర్భంగా భారీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా..మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అయితే ఘటనకు గల కారణాలను వెల్లడించలేదు. ఇద్దరు నిందితులు ప్రజలపై రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్టు స్థానికులు తెలిపారు.

తుపాకీ శబ్దం రాగానే భయంలో ప్రజలు పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పార్టీకి అనుమతి లేదని మెంఫిస్ పోలీసులు స్పష్టం చేశారు. ఘటనా సమయంలో సుమారు 200 నుంచి 300 మంది పార్టీలో పాల్గొంటున్నట్టు అంచనా వేశారు. దీంతో నిందితులను పట్టుకునేందుకు మెంఫిస్ సిటీలో బలగాలను మోహరించారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసు విచారణ చేపట్టి దాడి చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, అమెరికాలో ఇటీవల జరుగుతున్న కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

అక్కా తమ్ముళ్ల మృతి

మరోవైపు..మిచిగాన్‌లోని బోట్ క్లబ్‌లో పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా వారి పై నుంచి ఓ వాహనం దూసుకుపోవడంతో ఓ బాలిక(8), ఆమె సోదరుడు(5) అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో 12 మంది గాయపడ్డారు. మద్యం మత్తులో ఉన్న మహిళ కారును నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు వెల్లడించారు. 

Read More..

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హుజురాబాద్ విద్యార్థి మృతి

Tags:    

Similar News