రీల్స్ పిచ్చికి మరో ప్రాణం బలి.. ఫ్రెండ్స్ ముందు లైవ్‌లోనే తొమ్మిదేళ్ల బాలుడు మృతి
సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే పిచ్చి కొందరి ప్రాణాలు తీస్తోంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో పాపులర్ అవ్వడం కోసం కొందరు
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే పిచ్చి కొందరి ప్రాణాలు తీస్తోంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో పాపులర్ అవ్వడం కోసం కొందరు డేంజరస్ ఫీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. రీల్స్, షార్ట్స్ మోజులో పడే ఇప్పటికే ఎందరో మరణించినప్పటికీ కొందరు మాత్రం వాటిని పట్టించుకోకుండా చివరికి అలాగే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. రీల్స్ మోజులో పడి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల ప్రకారం.. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని మురైనా జిల్లాలో ఓ తొమ్మిదేళ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి ఉరి వేసుకుంటున్నట్లు నటిస్తూ సరదాగా ఓ రీల్ షూట్ చేస్తున్నారు.
అయితే, రీల్ చేస్తోన్న సమయంలో బాలుడి చెప్పులు స్లిప్ అయ్యి తాడు అతడి మెడకు బిగుసుకుపోయింది. ఈ విషయం అర్థం కానీ పక్కనే ఉన్న బాలుడి ఫ్రెండ్స్ యాక్టింగ్ చేస్తున్నాడేమో అనుకుంటూ అలాగే ఫోన్లో చిత్రీకరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాడు మరింత బిగిసుకుపోయి ఆ బాలుడు మరణించాడు. అప్పటికీ కూడా అతడు రీల్ కోసమే యాక్టింగ్ చేస్తున్నాడనుకుంటున్న అతడి ఫ్రెండ్స్ నవ్వుతూ అతడిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంతసేపటికి ఆ బాలుడు కదలకపోవడంతో భయాందోళనకు గురైన అతడి ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రీల్స్ పిచ్చిలో పడి అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.