ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో నిందితుల అరెస్ట్

మేళ్లచెరువు గ్రామానికి చెందిన నేర్న కంటి వీర గోపయ్య ఆదివారం

Update: 2024-02-27 15:48 GMT

దిశ,మేళ్లచెరువు : మేళ్లచెరువు గ్రామానికి చెందిన నేర్న కంటి వీర గోపయ్య ఆదివారం అనుమానస్పదంగా మరణించడంతో తోబుట్టువుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన మేళ్ల చెరువు పోలీసులు 2 రోజుల్లో నే ఛేదించారు. కోదాడ డీఎస్పీ శశిధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మృతుడి భార్య వీర కుమారిని విచారించగా మేళ్లచెరువు గ్రామానికి చెందిన షేక్ సైదా హుస్సేన్ తో గత కొంతకాలంగా అక్రమ సంబంధం ఉన్న విషయం భర్త వీరబాబు తెలవడం తో మందలించడం జరిగింది.

ఎప్పటికైనా తనకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ఉద్దేశంతో 25 రాత్రి సమయంలో భర్త వీర గోపయ్య ఒక ఫంక్షన్ కి వెళ్లి వచ్చి ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో భార్య ప్రియుడు కి ఫోన్ చేసి రప్పించి ఇద్దరూ కలిసి మొహం మీద దిండు అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా ఒప్పుకోవడం జరిగింది. నిందితులు వీర కుమారి, సైదా హుస్సేన్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు. క్రైమ్ నెంబర్ 29/2024, యు/ఎస్ 302 ఆర్/డబ్ల్యూ 34 ఐపీఎస్ సెక్షన్ కింద కేసు నమో చేసినట్లు గోపయ్య కి సంబంధించి ఆస్తులు పిల్లలకు చెందే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి సిఫార్సు చేయడం జరిగింది.పిల్లల మేనత్తల సంరక్షణలో ఉంచే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు

Read More..

మంత్రి సీతక్క కారు ఆపి యువకుడు హల్చల్ 

Tags:    

Similar News