దావత్‌లో చికెన్ తింటూ వ్యక్తి మృతి.. రిపోర్ట్‌లో ఏం తేలిందో తెలుసా?
మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరం చెప్పలేం. కడు పేదరికంలో జీవిస్తున్న వారికైనా.. వేల కోట్ల ఆస్తులున్న వారికైనా ఎవరి లైఫ్‌కీ గ్యారంటీ లేదు.
దిశ, వెబ్‌డెస్క్: మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరం చెప్పలేం. కడు పేదరికంలో జీవిస్తున్న వారికైనా.. వేల కోట్ల ఆస్తులున్న వారికైనా ఎవరి లైఫ్‌కీ గ్యారంటీ లేదు. ప్రస్తుతం రోజుల్లో చిన్న చిన్న రోగాలకే తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలు పోతున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. తీపి తింటే షుగర్.. ఉప్పు తింటే బ్లడ్ ప్రెషర్.. కారం తింటే అల్సర్‌తో సరిగ్గా ఇష్టమైనా భోజనం చేసినా అనారోగ్యానికి గురై చనిపోతున్నారు. తాజాగా.. ఉన్నట్టుండి కుప్పకూలి ఓ వ్యక్తి మృతిచెందాడు.
ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బతుకుదెరువు కోసం జితేంద్రకుమార్, ధర్మేంద్ర తివారి అనే ఇద్దరు జార్ఖండ్ నుంచి జిల్లాకు వచ్చారు. ఇటీవల మంచిగా దావత్ చేసుకోవాలని చికెన్ వండుకొని, మందు తెచ్చుకొని తాగడం ప్రారంభించారు. ఇంతలో జితేంద్రకుమార్ ఉన్నట్టుండి కిందపడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన ధర్మేంద్ర కమార్ అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా మార్గం మధ్యలోనే చనిపోయాడని వైద్యులు నిర్ధానించారు. కాగా, పోస్టుమార్టం రిపోర్ట్‌లో గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని మరణించాడని తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.