పెళ్లింట విషాదం.. బరాత్‌తో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన బాలుడు (వీడియో)
ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ గుండెపోటు వస్తోంది. ఐదేళ్ల బాలుడి నుంచి పండుముసలి వరకు అనేకమంది గుండెపోటుతో అర్ధాంతరంగా మృతిచెందుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ గుండెపోటు వస్తోంది. ఐదేళ్ల బాలుడి నుంచి పండుముసలి వరకు అనేకమంది గుండెపోటుతో అర్ధాంతరంగా మృతిచెందుతున్నారు. తాజాగా.. మరో బాలుడు గుండెపోటుకు బలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఒక పెళ్లి వేడుక జరిగింది. వివాహం అనంతరం నిర్వహించిన బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ సుధీర్ అనే 15 ఏళ్ల బాలుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన బంధువులు, స్నేహితులు హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. డీజే బాక్స్‌ల శబ్ధానికే బాలుడికి గుండెపోటు వచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. చనిపోయిన బాలుడు వరుడికి సోదరుడు కావడం గమనార్హం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
DJ శబ్దానికి గుండెపోటుతో బాలుడు మృతి
— Telugu Scribe (@TeluguScribe) March 8, 2024
యూపీలో ఓ పెళ్లి వేడుకలో విషాదం జరిగింది. డాన్స్ చేస్తూ 15 ఏళ్ల బాలుడు మరణించాడు. తన సోదరుడి వివాహ వేడుకలో సుధీర్ డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. డీజే శబ్దానికే… pic.twitter.com/UrFpfoHXIc