విస్తృతంగా తనిఖీలు..82 వేల నగదు సీజ్‌

సార్వత్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల‌వుతున్న క్ర‌మంలో ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం లో అధికారులు ముమ్మ‌రంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు.

Update: 2024-03-25 15:26 GMT

దిశ,ఏలూరు:సార్వత్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల‌వుతున్న క్ర‌మంలో ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం లో అధికారులు ముమ్మ‌రంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం నిర్వహించిన తనిఖీల్లో గణపవరం మండలం సరిపల్లి వద్ద 82 వేల రూపాయలను సీజ్ చేసిన‌ట్లు ఉంగుటూరు నియోజకవర్గ ఎన్నిక‌ల అధికారి ,ఏలూరు ఆర్డీవో ఎన్ ఎస్ కె.ఖాజావలి వెల్ల‌డించారు.ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం జరిపిన తనిఖీల్లో రూ.82 వేల నగదు గుర్తించి స్వాధీన పరచు కున్నారన్నారు. నగదు తీసుకు వెళ్ళే సమయంలో సంబంధిత పత్రాలు తమతో ఉంచుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు రూ.50 వేల కంటే ఎక్కువ తరలిస్తేసార్వత్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల‌వుతున్న క్ర‌మంలో ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం లో అధికారులు ముమ్మ‌రంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు.స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.

Read More..

అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం..ముగ్గురు అరెస్ట్

Tags:    

Similar News