కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్య..

కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై గడ్డి మందు తాగి యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని జయరాం తండాలో జరిగింది.

Update: 2023-06-25 15:25 GMT
కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్య..
  • whatsapp icon

దిశ, పెద్దవూర : కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై గడ్డి మందు తాగి యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని జయరాం తండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దవూర మండలం జయరాం తండా గ్రామానికి చెందిన కేతావత్ పాండు అనే అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కీరి, రెండో భార్య పేరు రాజి, పెద్ద భార్యకు ఇద్దరు అమ్మాయిలు, రెండో భార్యకు ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. గత కొంత కాలం నుండి ఇద్దరు భార్యలు, వారి కుటుంబ సభ్యులకు ఆస్తుల విషయంలో గొడవలు అవుతున్నాయి.

అదే క్రమంలో తేదీ 22.06.2023 రోజున ఉదయం సదరు పాండుకు, చిన్న భార్య రాజికి గొడవ జరిగింది. ఆ గొడవలో పాండు అతని కుటుంబ సభ్యులు రాజినీ, ఆమె కూతురు సంధ్య (18) లను తిట్టడంతో మనస్థపానికి గురియైన సంధ్య అదేరోజు ఉదయం తమ భూమి వద్ద కు వెళ్లి గడ్డి మందు తాగింది. అనంతరం ఆమెను హైదరాబాద్ లోని ఓవైసీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా శనివారం మధ్యాహ్నం మృతిచెందింది. మృతురాలి తల్లి రాజి ఫిర్యాదు మేరకు పాండు, అతని పెద్ద భార్య కీరి, వారి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పరమెష్ తెలిపారు.

Tags:    

Similar News