జాతీయ రహదారిపై యువకుడు హల్చల్

రాచకొండ పోలీస్ కమిషనరేట్, పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిమెట్లలో వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం ఓ యువకుడు హల్చల్ చేశాడు.

Update: 2025-03-22 09:04 GMT
జాతీయ రహదారిపై యువకుడు హల్చల్
  • whatsapp icon

దిశ, ఘట్కేసర్ : రాచకొండ పోలీస్ కమిషనరేట్, పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిమెట్లలో వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం ఓ యువకుడు హల్చల్ చేశాడు. రాళ్లతో వాహనాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ దాడిలో పరువురికి గాయాలు అయ్యాయి. యువకుడు వికృత చేష్టలకు సహనం కోల్పోయిన ప్రజలు యువకుడ్ని పట్టుకొని చితక బాధడంతో స్పృహ కోల్పోయాడు.

    వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిని అదుపులోకి తీసుకొని గాంధీ ఆసుపత్రికి తరలించారు. హల్చల్ చేసిన వ్యక్తి మతిస్థిమితం లేకనో, మద్యం మత్తులోనో దాడికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఏదైతేనేం యువకుడి సైకో చర్యలతో రహదారిపై దాదాపు గంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి.  


Similar News