పిల్లలు కలగడం లేదని యువకుడు ఆత్మహత్య
పెళ్లయి నాలుగేళ్లయినా పిల్లలు కలగడం లేదని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తంగళ్లపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

దిశ, తంగళ్లపల్లి : పెళ్లయి నాలుగేళ్లయినా పిల్లలు కలగడం లేదని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తంగళ్లపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి భార్య కథనం ప్రకారం.. తంగళ్లపల్లి గ్రామానికి చెందిన మామిండ్ల మహేష్, కల్పనలకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టక పోవడంతో తన భర్త మానసికంగా కృంగిపోయినట్లు భార్య కల్పన పోలీసులకు తెలిపింది.
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపంతో ఉంటున్న మహేశ్ ఈనెల 17న మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు తన భర్తను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేస్తుండగా పరిస్థితి విషమించి శనివారం ఆస్పత్రిలో మరణించాడు. భార్య కల్పన ఇచ్చిన ఫిర్యాదు మేరకు తంగళ్లపల్లి ఎస్ఐ రామ్మోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.