చెట్టుకు ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య..
సుల్తానాబాద్ పట్టణంలో చెట్టుకు ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకుంది.
దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ పట్టణంలో చెట్టుకు ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన చిలగాని భారతి (50) భర్త సత్యనారాయణ కుటుంబం ఆర్థికంగా బలహీనపడి అప్పులు చేసి వారి అవసరాలు తీర్చుకున్నారు. అప్పులు ఇచ్చినవారు అడగడంతో భారతి మానసికంగా వేదన చెంది బాధపడుతూ శనివారం ఉదయం సుల్తానాబాద్ పాత కోర్టు ఆవరణలో వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి మృతదేహాన్ని తరలించారు.