గడ్డి మందు తాగి మహిళ ఆత్మహత్య
తల్లితో గొడవపడి క్షణికావేశానికి గురైన బత్తుల ఇందిర(48) అనే మహిళ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం మండల కేంద్రంలోని పద్మశాలి వాడలో చోటు చేసుకుంది.
దిశ, మంగపేట : తల్లితో గొడవపడి క్షణికావేశానికి గురైన బత్తుల ఇందిర(48) అనే మహిళ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం మండల కేంద్రంలోని పద్మశాలి వాడలో చోటు చేసుకుంది. కుటుంబంలో జరిగిన గొడవల కారణంగా క్షణికావేశానికి గురైన ఇందిర నర్సాపురం బోరు పంచాయతీ గౌరారం వాగు ప్రాంతంలో తన మిరప నారు కోసం తెచ్చిన గడ్డి మందును తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గడ్డి మందు మంటకు తట్టుకోలేక కేకలు వేస్తుండగా గమనించిన సమీపంలోని రైతు కూలీలు, బంధువులు ఇంటికి సమాచారం అందించి ఏటూరునాగారం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.