రెండు లారీలు ఢీ.. యాసిడ్ ట్యాంకర్ బోల్తా..
రెండు లారీలు ఢీకొని యాసిడ్ ట్యాంకర్ బోల్తా పడిన సంఘటన తల్లాడ మండలంలో ఆదివారం తెల్లవారుజామున జరిగినది.

దిశ, తల్లాడ : రెండు లారీలు ఢీకొని యాసిడ్ ట్యాంకర్ బోల్తా పడిన సంఘటన తల్లాడ మండలంలో ఆదివారం తెల్లవారుజామున జరిగినది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న యాసిడ్ ట్యాంకర్ అలాగే తల్లాడ వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ పినపాక డాన్ బాస్కో స్కూల్ వద్ద ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి.
దీంతో యాసిడ్ తో కూడిన లారీ ట్యాంకర్ బోల్తా పడటంతో ట్యాంకర్ నుంచి యాసిడ్ లీక్ అయ్యి రోడ్డు మీద పడటంతో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం జరిగింది. ఇది తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్కును క్లియర్ చేసి రెండు లారీలను రోడ్డు పక్కకు జరిపారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.