వ్యక్తి అదృశ్యం.. భార్య ఫిర్యాదు..
ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రోజు మాదిరిగానే విధులకు హాజరై తిరిగి ఇంటికి చేరలేదని తన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దిశ, ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రోజు మాదిరిగానే విధులకు హాజరై తిరిగి ఇంటికి చేరలేదని తన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తివివరాల్లోకెళితే మున్సిపాలిటీ పరిధి ఆదర్శనగర్ కాలనీకి చెందిన రవికుమార్ ఆమనగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.
రోజు మాదిరిగానే గురువారం కూడా పాఠశాలలో విధులకు హాజరయ్యాడు. ఎంతకీ ఇంటికి తిరిగిరాకపోవడంతో కంగారు పడిన కుటుంబసభ్యులు చరవాణికి కాల్ చేసినా ఫలితం లేకపోయింది. తనభర్త చరవాణి స్విచ్ ఆఫ్ వస్తుందని తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ రవికుమార్ భార్య అనిత పోలీసులకు చట్టరీత్యా చర్యతీసుకుని న్యాయం చేయగలరని వినతిపత్రం అందజేసింది.