తీవ్ర విషాదం.. రోకలిబండతో భార్యపై దాడి.. ఆపై భయంతో ఏం చేశాడో తెలుసా ?
జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడి పల్లి గ్రామంలో విషాదం నెలకొంది.

దిశ, కొడిమ్యాల ( మల్యాల ) : జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడి పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. స్థానిక ఎస్సై నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సాధుల దుర్గయ్య (55) భార్య రాజవ్వపై అనుమానంతో శుక్రవారం రోకలి బండతో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రాజవ్వను చికిత్స నిమి త్తం కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలించారు. అయితే భార్య చనిపోతుందనే భయంతో గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని దుర్గయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స పొందుతున్న భార్య రాజవ్వ సైతం పరిస్థితి విషమించి మరణించింది. కాగా ఒకే రోజు భార్యాభర్తలు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.