ఇంతకూ తమ్మినేని రెండు చేతులను ఎందుకు నరికి తీసుకెళ్లారు..?
ఖమ్మం జిల్లాలో జరిగిన తమ్మినేని కృష్ణయ్య హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది.
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో జరిగిన తమ్మినేని కృష్ణయ్య హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు సోదరుడైన కృష్ణయ్య స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని వస్తుండగా దుండగులు వెనక నుంచి ఆటోలో వచ్చి దారుణంగా నరికి చంపారు. నాలుగు దశాబ్దాలుగా సీపీఎంలోనే ఉన్న కృష్ణయ్య.. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వర్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం తుమ్మలకు ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు. కృష్ణయ్య పార్టీ మారడంతో గ్రామంలో నిత్యం రాజకీయ ఘర్షణలు కొనసాగాయి. ఇదే క్రమంలో వీరభద్రం సోదరుడైన కోటేశ్వర్ రావుకు కృష్ణయ్యకు మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది. గతంలోనూ కృష్ణయ్యపై హత్యాయత్నాలు జరిగినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.
తాజాగా కృష్ణయ్య స్వతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం మరో గ్రామానికి వెళ్లి వస్తుండగా.. దుండగులు పక్కా స్కెచ్‌తో ఆటోలో వెనక నుంచి వచ్చి ఢీకొట్టారు. బైక్ కిందపడిపోవడంతో వెంటనే వేట కొడవళ్లు, గొడళ్లతో దాడి చేసి దారుణంగా నరికి చంపారు. ఎప్పుడూ కార్లోనే వెళ్లే కృష్ణయ్య.. నేడు బైక్‌పై వెళ్లడాన్ని గుర్తించిన ప్రత్యర్ధులు పక్కా వ్యూహంతోనే దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎటాక్ సమయంలో కృష్ణయ్య వెంట కారు డ్రైవర్ ముత్తయ్య మాత్రమే ఉన్నాడు. దుండగులను చూసి అతడు పరారీ అయినట్లు తెలుస్తోంది.
అయితే దుండగులు కృష్ణయ్యను విచక్షణ రహితంగా నరికిన తర్వాత అతడి రెండు చేతులను కట్ చేసుకోని వారి వెంట తీసుకెళ్లడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. దాడి చేసిన వేట కొడవళ్లను సైతం ఘటన స్థలంలోనే వదిలేసిన దుండగులు.. హస్తాల (చేతుల)ను మాత్రం ఎందుకు వారి వెంట తీసుకెళ్లారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఆ ప్రచారంలో నిజం లేదు..
అయితే దుండగులు దాడి చేసే సమయంలో కృష్ణయ్య చేతులు అడ్డుపెట్టడంతో రెండు తెగిపెడ్డాయి. దాడి సమయంలో ఓ చెయ్యి తెగి ఘటనా స్థలానికి దూరంగా పడగ.. మరో చెయ్యి వేలాడపడింది. అయితే గమనించిన స్థానికులు చేతులను నరుక్కోని తీసుకెళ్లారని పొరపడినట్లు పోలీసులు తెలిపారు. కృష్ణయ్య చేతులు అక్కడే ఉన్నాయని, ఎవరు తీసుకెళ్లలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు.
తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. హంతకుల పేర్లు చెప్పిన ప్రత్యక్ష సాక్షి