దారుణ హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఎంజీ కాలనీ తండాలో రాత్లావత్
దిశ, వెల్దండ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఎంజీ కాలనీ తండాలో రాత్లావత్ రాజు( 30 )ను అనే వ్యక్తిని దారుణంగా గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఎంజీ కాలనీ తండా కు చెందిన రాజు, భార్య హిమబిందు తన వ్యవసాయ పొలం వద్ద గురువారం రాత్రి బుడ్డ చేను వద్ద అడవి పందుల కోసం కాపలా ఉండగా... శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు రాజు పై తల, ముఖంపై దారుణంగా దాడి చేసి హత్య చేశారు.
అర్ధరాత్రి సమయంలో రాజు మోటర్ బంద్ చేయడాని వెళ్లాడని ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో భార్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలపగా తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో చుట్టుపక్కల వెతికి చూడగా రక్తపు మడుగులో కనిపించాడన్నారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మమ్మల్ని కూడా ఎవరైనా హత్య చేస్తారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన స్థలానికి సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్సై కురుమూర్తి చేరుకొని పరిశీలించి, అనుమానాస్పద స్థితి గా గుర్తించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని చేరుకుని పరిశీలించారు. ఈ హత్య కేసు అనుమానస్పద స్థితి కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ హత్యతో మండలంలో కలకలం రేపి చర్చనీయాంశంగా మారింది. రాజుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.