టిప్పర్ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

Update: 2025-03-16 14:34 GMT

దిశ, జనగామ : టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా పోస్టాఫీస్ టర్నింగ్ పాయింట్ వద్ద వ్యక్తిని టిప్పర్ ఢీ కొట్టింది. దాంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని వారు సూచించారు. 


Similar News