ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు మృతి

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ కాంబోలో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Update: 2025-01-06 05:13 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ కాంబోలో తెరకెక్కిన గేమ్ చేంజర్(Game changer) సినిమా ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం విజయవాడలో భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్(Free release event) ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ముఖ్య అతిథిగా పాల్గొనగా.. లక్షల మంది ఫ్యాన్స్ హజరయ్యారు. అనంతరం ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం(road accident) జరిగి ఇద్దరు యువకులు మృతి(Two youths died) చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి - రంగంపేట మండలం ఏడీబీ రోడ్డులో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో బైక్ పై వెళ్తుండగా వ్యాన్ ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న మణికంఠ (23) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన చరణ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతులు కాకినాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.


Similar News