డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో ఇద్దరికి జైలు శిక్ష

మండలంలోని కొయ్యూరు చౌరస్తాలో బుధవారం నిర్వహించిన

Update: 2024-10-16 16:04 GMT

దిశ, మల్హర్: మండలంలోని కొయ్యూరు చౌరస్తాలో బుధవారం నిర్వహించిన పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో ఇద్దరికి జైలు శిక్ష పడింది. మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను కొయ్యూరు ఎస్సై వడ్లకొండ నరేష్ భూపాలపల్లి కోర్ట్ లో హాజరుపరచగా భూపాలపల్లి జడ్జి రామచంద్ర రావు రెండు రోజులు జైలు శిక్ష విధించి ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు. ట్రాఫిక్ రూల్స్ కు విరుద్ధంగా తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై నరేష్ హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కన్విక్షన్ వచ్చినందుకు ఎస్సై నరేష్, కోర్టు కానిస్టేబుల్ సతీష్ లను భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖర్గే, కాటారం డీస్పీ రామ్మోహన్ రెడ్డి, సీఐ నాగార్జున రావు వారిని అభినందనలు తెలిపినట్లు పేర్కొన్నారు.


Similar News