గోడకూలి ఇద్దరు మృతి… మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

కోళ్ల ఫారం గోడ కూలిపోయి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం చిన్నశంకరంపేట మండలం కామారం గిరిజన తండా లో చోటుచేసుకుంది.

Update: 2024-11-11 12:41 GMT

దిశ, చిన్నశంకరంపేట: కోళ్ల ఫారం గోడ కూలిపోయి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం చిన్నశంకరంపేట మండలం కామారం గిరిజన తండా లో చోటుచేసుకుంది. ఎస్సై నారాయణ గౌడ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కామారం తండా పంచాయతీ పరిధిలో కోళ్ల ఫారం నిర్మాణ పనులు చేస్తున్న జార్ఖండ్ రాష్ట్ర వలస కూలీల పై గోడకూలి పడటంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందినట్లు ఎస్సై నారాయణ గౌడ్ తెలిపారు. సంఘటన స్థలానికి వెళ్ళి ఇద్దరి శవాల పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్. ఐ నారాయణ గౌడ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Similar News