Tragedy: మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. యువతి ప్రాణాలు తీసిన డీజే

మహబూబాబాద్ (Mahbubabad) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Update: 2025-02-05 06:26 GMT
Tragedy: మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. యువతి ప్రాణాలు తీసిన డీజే
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ (Mahbubabad) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సీరోలు (Sirolu) మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాల (Ekalavya Model Residential School, College)లో మంగళవారం అర్ధరాత్రి వరకు పదో తరగతి విద్యార్థులకు యాజమాన్యం ఫేర్‌వెల్ ఫంక్షన్‌ (Farewell function)ను నిర్వహించింది. అయితే, సంస్కృతిక కార్యక్రమాల నేపథ్యంలో పెద్ద ఎత్తున డీజే సౌండ్‌ సిస్టమ్‌ (DJ Sound System)ను కూడా ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే మరిపెడ (Maripeda) మండల పరిధిలోని సపావట్ తండా (Sapawat Tanda)కు చెందిన సీఈసీ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని సపావట్ రోజా (Sapawat Roja) (16) సంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంది. అనంతరం డాన్స్ చేసేందుకు వేదికపైకి వెళ్లగా.. డీజే సౌండ్ ధాటికి తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గమనించిన వెంటనే కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజాను చికిత్స నిమిత్తం మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రి (Mahbubabad General Hospital)కి తరలించారు. కానీ, అప్పటికే యువతి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఫేర్‌వెల్ డే రోజున రోజా ప్రణాలు కోల్పోవడం పట్ల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, తల్లిందండ్రులు కన్నీటి పర్యంతమైయ్యారు. 

Tags:    

Similar News