బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసున్న తెలుగు హీరో కూతురు.. కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తున్న పోలీసులు?
తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఆరా తీస్తున్నా కొద్ది ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఆరా తీస్తున్నా కొద్ది ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. తాజాగా బెట్టింగ్ యాప్స్(Betting Apps) ప్రమోట్ చేసిన వారి జాబితాలో టాలీవుడ్(Tollywood) నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసేందుకు హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు(Panjagutta Police) రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మంచు లక్ష్మి పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దని ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా మార్పు రాకపోవడంతో.. ప్రస్తుతం పూర్తి ఆధారాలు సేకరించి అందరిపై కేసు నమోదు చేస్తున్నారు.

ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్(Betting Apps)ను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్, టీవీ నటుల్లో పలువురిపై కేసులు నమోదు అయ్యాయి. వారిలో యాంకర్లు విష్ణుప్రియ, శ్యామల, హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, రీతూ చౌదరి, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్ పలువురిపై పలు సెక్షన్లతో పాటు యాక్టుల కింద కేసులు నమోదు చేశారు. తాజాగా.. పోలీస్ యూనిఫాం ధరించి బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ రాజు గౌడ్‌పైనా కేసు నమోదు చేశారు. ఇప్పటికే సేకరించిన యాప్స్ లింక్స్ ఆధారంగా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం.
Read More..
చిన్నోళ్ళు సరే.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన హీరో, హీరోయిన్స్‌పై కేసులు పెట్టరా? నెటిజన్స్
Bettig Apps: 11 మంది యూట్యూబర్స్,ఇన్ ఫ్లూయెన్సర్స్‌ల ఆర్థిక లావాదేవీలపై పోలీసుల నజర్..