crime news : కలిసొచ్చిన ఫోన్ సంభాషణ.. కనుసైగలతో రూ.3.50 లక్షలు చోరీ..

ద్విచక్రవాహనానికి తగిలించిన సంచిలోంచి రూ.3.50 లక్షల నగదును సినీ ఫక్కీలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన పట్టణంలోని బస్టాండ్లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.

Update: 2024-10-29 06:10 GMT

దిశ, మక్తల్ : ద్విచక్రవాహనానికి తగిలించిన సంచిలోంచి రూ.3.50 లక్షల నగదును సినీ ఫక్కీలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన పట్టణంలోని బస్టాండ్లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడు ఫోన్ మాట్లాడుతూ ఉన్న విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ చోరీ చేస్తున్నవానికి ఇషారా చేస్తూ పని ముగియగానే బైక్ పై రాయిచూరు వైపు పరారైన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో నమోదయ్యాయి. వివరాల్లోకెళితే మాగనూరు మండలం వడ్వాట్ గ్రామానికి చెందిన సురేందర్శెట్టి నారాయణపేట రహదారిలోని ఎస్బీఐ బ్యాంకులో 8 తులాల బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ. 3.50 లక్షల నగదును తీసుకున్నాడు. పని పూర్తి అయ్యాక బాధితుడు ఇంటికి ద్విచక్రవాహనం పై వెళుతూ మక్తల్ ఆర్టీసీ బస్టాండ్ కు వచ్చారు. అక్కడ బాధితున్ని దొంగల ముఠా  అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టింది. 

ఓ దుకాణం ముందు ఫొన్లో సంబాషిస్తూ కొబ్బరి బొండం, పెరుగు పాకెట్లు తీసుకునేందుకు బాధితుడు వెళ్లగా అది దొంగలకు కలిసి వచ్చింది. ఈ విషయాన్ని ముఠాలోని వ్యక్తి గమనిస్తూ బండికి తగిలించిన సంచిలోని రూ. 3.50 లక్షలను తరస్కరించాడు. సంచిలో ఉన్న నగదు బెండల్ కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన సురేందర్శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలించి విచారణ చేపట్టారు. నగదు చోరీ చేసిన వ్యక్తి హెయిర్ స్టైల్, నడవడికను గమనించిన కొందరు ఈ వ్యక్తులు కర్ణాటకకు చెందిన వారై ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో సీసీ కెమెరాలో చోరీ చేసిన వ్యక్తితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి తెలిపారు.

Tags:    

Similar News