మామపై వేడి నూనె పోసి హత్య చేసిన మహిళ అరెస్ట్
నిద్రిస్తున్న మామపై కాగుతున్న వేడి నూనెను పోసి హత్య చేసిన కేసులో నిందితురాలిని శనివారం కారేపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
దిశ, కారేపల్లి : నిద్రిస్తున్న మామపై కాగుతున్న వేడి నూనెను పోసి హత్య చేసిన కేసులో నిందితురాలిని శనివారం కారేపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిం చారు. కారేపల్లి మండలం ఫైల్‌తండాలో డిసెంబర్ 28న అజ్మీర బాబు మంచంపై నిద్రిస్తుండగా కోడలైన అజ్మీర ఉమ వేడిగా కాగుతున్న నూనెను మామ ముఖంపై పోసింది. దీంతో అజ్మీర బాబు వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 1వ తేదీన మృతి చెందాడు. మృతుడి అల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి నిందిరాలిని శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.