పని చేయడం లేదని తండ్రిని కొట్టి చంపిన కొడుకు..

చాలా మంది మద్యానికి బానిసలుగా మారి కుటుంబాలను పక్కన పెట్టేస్తుంటారు.

Update: 2023-03-26 04:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది మద్యానికి బానిసలుగా మారి కుటుంబాలను పక్కన పెట్టేస్తుంటారు. దీంతో కుటుంబాలలో గొడవలు మొదలై క్షణికావేశాలకు పోయి ప్రాణాలు సైతం పోగొట్టుకుంటారు. తాజాగా తెలంగాణలో జరిగిన ఇలాంటి ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. తండ్రి మద్యానికి బానిసగా మారి ఏ పని చేయకుండా కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడని ఆగ్రహంతో కొడుకు కొట్టడంతో అతడు మరణించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రామాంతాపూర్‌లోని వెంకటరెట్టి నగర్‌కు చెందిన సుదర్శన్ (58), భార్య గోపమ్మ, కుమారుడు శివకుమార్‌తో నివాసం ఉండేవాడు. అయితే సుదర్శన్ మద్యానికి బానిసగా మారి నిత్యం మందు సేవించేవాడు. ఈ క్రమంలోనే అతడు ఏ పని చేయకుండా తిరిగేవాడు. ఈ విషయమై శుక్రవారం భార్య, కుమారుడు సుదర్శన్‌తో గొడవకు దిగారు. క్షణికావేశంలో కొడుకు శివకుమార్, తల్లి గోపమ్మ సుదర్శన్‌పై దాడి చేయగా.. అపస్మారక స్థతికి చేరుకున్నాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గ మధ్యలో మరణించాడు. అయితే జరిగిన ఘటనపై మృతుడు సోదరుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News