పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని.. ప్రేమ జంట ఆత్మహత్య
దిశ, శంషాబాద్ : ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారని ఇంట్లో ఉరి - The elders did not agree to the marriage.. The love couple committed suicide
దిశ, శంషాబాద్ : ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మైలార్ దేవ్ పల్లి ఇన్ స్పెక్టర్ నరసింహ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌లకు చెందిన రవి కుమార్ (20) నేతాజీ నగర్‌కు చెందిన ఓ 17 సంవత్సరాల మైనర్ బాలిక గత 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. రవి కుమార్ కుటుంబంతో కలిసి నేతాజీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ఇరువురు పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని పెద్దలకు చెప్పడంతో అందుకు అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు అంగీకరించ లేదన్నారు. దీంతో రవికుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో రవి కుమార్, మైనర్ బాలిక ఇద్దరు ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పుట్టిన రోజు వేడుకలో బ్యూటీషియన్‌పై అత్యాచారం.. మద్యం తాగించి..